ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న అనుష్కశర్మ
- January 29, 2018ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న హీరోయిన్!
హైదరాబాద్: సినిమాలోని పాత్ర కోసం కొందరు నటులు ఎంత శ్రమకైనా వెనుకాడరు. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. కథానాయకులకు దీటుగా వారూ కష్టపడుతుంటారు. ఇప్పుడు అనుష్కశర్మ కూడా కష్టపడుతోంది. అయితే అదేదో ఫిట్నెస్ కోసమో.. కత్తియుద్ధాల కోసమో కాదు. 'సుయి ధాగా' సినిమా కోసం సూదీ దారం పట్టింది.
దర్శకుడు శరత్ కఠారియా, నిర్మాత మనీష్ శర్మలు కలిసి తీసిన చిత్రం 'దమ్ లాగాకే హైషా' మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి వీరిద్దరి కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం 'సుయి ధాగా'. వరుణ్‌ధావన్, అనుష్కశర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకోగా, ఇప్పడు అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది. ఈ మేరకు సినిమాలో ఆమె పాత్ర ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న అనుష్కశర్మ ఫొటోను యశ్‌రాజ్ ఫిల్మ్ అభిమానులతో పంచుకుంది.
గతేడాది డిసెంబరు 12న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్కశర్మ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో బిజీగా ఉండగా, అనుష్క శర్మ తన సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







