సౌదీఅరేబియాలోని అల్ సవర్మ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
- January 29, 2018
రియాద్:సౌదీఅరేబియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. చనిపోయినవారిలో ఓ గర్భణి, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒక వివాహానికి హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి సౌదీఅరేబియాలోని అల్ సవర్మ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కును మరో ట్రక్కు లాకొస్తూ రోడ్డెక్కింది. వెనుకనున్న ట్రక్కుకు లైట్లు వెలగకపోవడంతో పెళ్ళి వేడుకులకు వెళ్తున్న కారు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వెనుకనున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది . ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయి జీవచ్ఛం మాదిరిగా ఆ తండ్రి రోడ్డు రవాణా శాఖాపై కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తానని విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







