పాకిస్తాన్ లో పాశవికంగా యువతిని హత్య చేసి ..సౌదీ అరేబియాలో దాగిన హంతకుడు

- January 30, 2018 , by Maagulf
పాకిస్తాన్ లో పాశవికంగా యువతిని హత్య చేసి ..సౌదీ అరేబియాలో దాగిన హంతకుడు

సౌదీఅరేబియా:ఒక మహిళను దారుణంగా హత్య చేసి ...వెనువెంటనే సౌదీ అరేబియాకు వచ్చాడా కసాయి. వివరాలలోకి వెళితే ఈ హంతకుడు  పాకిస్తాన్‌లోని ఓ యువతిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అస్మాని ఆమె ఇంట్లోనే హంతకుడు తుపాకీతో కాల్చి చంపేశాడని పోలీసులు చెప్పారు. పాకిస్తాన్ లోని అబోటాబాద్‌కు చెందిన అఫ్రిదిగా గుర్తించారు. ఇంటర్‌పోల్ అధికారులు హంతకుడి కోసం సౌదీలో గాలింపు చర్యలు మొదలుపెట్టారని పాకిస్తానీ పోలీసులు తెలిపారు.అయితే అస్మాను అతడు ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడని ఆమె తండ్రి చెబుతున్నాడు. ఆ యువతీ అఫ్రిది చేష్టలపై విసిగిపోయి   పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు కక్ష కత్తిని ఆ దుర్మార్గుడు తమ ఇంటిపై దాడి చేశాడన్నాడు. పాకిస్తానీ లోని  తారీఖు ఇన్సాఫ్ పార్టీకి చెందిన కీలకనేతకు మేనల్లుడు కావడంతో పోలీసులు కూడా తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని అస్మా తండ్రి చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com