కువైట్ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

- January 31, 2018 , by Maagulf

కువైట్: కువైట్ లో నివసిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి  కుల , మత ప్రాంతాలకు అతీతంగా జనవరి 26 వ తేదీన జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశం లో పార్టీ నాయకత్వానికి ఏ విధంగా నైతిక మద్దతు తెలపాలి మరియు ఓటు మనం వెయ్యిలేక పోయినా మన కుటుంబ సభ్యుల ఓట్లు వేసే విధంగా అవగాహన తో పాటు జనసేన పార్టీ పై జరుగుతున్న కుట్రని పార్టీ పై వేస్తున్న కులముద్రని కార్యకర్తలు అందరూ ఖండించారు. జనసేన పార్టీ  కార్యకర్త విజయ్ కుమార్ స్వామి గారు ఎంతో కస్టపడి వ్యయ ప్రయాసలతో గల్ఫ్ బాబాయ్ యూ ట్యూబ్ ఛానల్ సహకారం తో చిగురుపాటి విజయ్ భాస్కర్ మరియు సురేష్ తాతినేని రచించిన పాటని ,గిరిప్రసాద్ కాసా దర్సకత్వంలో  కువైట్ లో వాఫ్రా , మాలియా , షరఖ్ ప్రాంతాల్లో కార్యకర్తలతో  రూపొందించిన నాయకుడా "మేము సిద్ధం సిద్ధం" పాటని  జనసేన పార్టీ కి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అంకితమిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చెయ్యడం లో పత్తి సుబ్బారాయుడు , వెంకీ కాసా , శ్రీనివాస రావు పోలనాటి , సత్య , శమంత్ పసుపులేటి , రాజశేఖర్ తోట మనీష్ , వినయ్ , కమల్ బాషా అలియాస్ కమల్ కళ్యాణ్ , షేక్ మస్తాన్ తో పాటు పలు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com