దుబాయ్:ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ సస్పెన్షన్
- January 31, 2018
దుబాయ్:దుబాయ్ హెల్త్ కేర్ సిటీ అథారిటీస్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్‌ని సస్పెండ్ చేయడం జరిగింది. తన క్లినిక్‌కి సంబంధించి వీడియో విడుదల చేయడం ద్వారా అనైతిక చర్యలకు పాల్పడినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నట్లు దుబాయ్ హెల్త్ కేర్ సిటీ సీఈఓ డాక్టర్ రమదాన్ అల్ బలౌషి చెప్పారు. యూఏఈ కస్టమ్స్ మరియు ట్రెడిషన్స్ అలాగే పబ్లిక్ డిసెన్సీకి సంబంధించి చట్ట వ్యతిరేక చర్యకు ఆ ప్లాస్టిక్ సర్జన్ పాల్పడినట్లు నిర్ధారించారు. ప్లాస్టిక్ సర్జన్ సస్పెన్షన్‌కి సంబంధించి యూఏఈలోని అన్ని ఆసుపత్రులకూ అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. అతని లైసెన్స్‌ని రద్దు చేయడం జరిగిందనీ, ఎవరూ అతన్ని తమ వద్ద చేర్చుకోవద్దని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇలాంటి చర్యల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో వైద్య ప్రముఖుడిపై చట్టపరమైన చర్యలుంటాయనీ, అతను పనిచేసిన క్లినిక్‌కి ఈ ఉదంతంతో సంబంధం లేని అధికారులు స్పస్టతనిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







