దుబాయ్‌:గంటకు 200 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్‌ సూపర్‌ కార్‌

- January 31, 2018 , by Maagulf
దుబాయ్‌:గంటకు 200 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్‌ సూపర్‌ కార్‌

దుబాయ్‌:దుబాయ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌, అత్యంత వేగంతో ప్రయాణించే అంబులెన్స్‌ కారుని ప్రారంభించింది. ఈ కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, అవసరమైన చోటకి వీలైనంత తక్కువ సమయంలో చేరుకుని, ఆపదలో ఉన్నవారికి సాయపడుతుంది. దుబాయ్‌ అంబులెన్స్‌ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ, న్యూ స్పోర్ట్స్‌ కార్‌గత నెలలో ప్రారంభించామనీ, ఆన్‌ మరియు ఆఫ్‌ రోడ్‌లో ఇది ఉపయోగిస్తామని చెప్పారు. అరబ్‌ హెల్త్‌ వద్ద డిస్‌ప్లే కోసం ఉంచినా, ఇది సిటీ వాక్‌ వద్ద స్టేషన్‌ చేయబడి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇలాంటి కార్లను ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తామని దుబాయ్‌ అంబులెన్స్‌ ప్రతినిథులు తెలిపారు. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ సహా, అంబులెన్స్‌లో ఉండే చాలా సౌకర్యాల్ని ఇందులో పొదుపర్చారు. ఇటీవలే డిసిఎస్‌ బైసికిల్‌ అంబులెన్స్‌ని కూడా ప్రారంభించింది. ప్రమాదంలో ఉన్నవారిని వీలైనంత తక్కువ సమయంలో రక్షించేందుకు, వారికి వైద్య సహాయం అందించేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు డిఎసిఎస్‌ చెప్పింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com