పీపాల కొద్ది ఆయిల్ . విధ్యుత్ తీగలను దొంగిలించిన నిందితులు అరెస్ట్
- January 31, 2018
కువైట్ : కుళాయి తిప్పుకొని దాహం తీర్చుకొన్నమాదిరిగా ..నూతులలో ఊరే ఆయిల్ గదా ..ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొద్దిగా తోడుకున్నామంతే అంటున్న కువైట్, సౌదీ దేశాలకు చెందిన ఇద్దరు నేరస్తులను కువైట్ అపరాధ పరిశోధకులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఘరానా దొంగలు చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఇనుప కంచెని కత్తిరించి లోపలకు దర్జాగా ప్రవేశించి ఆయిల్ బావిలో టిన్నుల కొద్ది పెట్రోల్ అపహరించడమే కాక అక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగిలించారు. ఆయిల్ బావులకు కలుపబడిన రెండు ముఖ్యమైన వైర్లను కత్తిరించి చమురు ఉత్పత్తిని నిలిచిపోయేలా చేశారు. ఈ దొంగ సొత్తును అంగారాలో విక్రయించడానికి బేరం పెట్టారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన క్రిమినల్ డిటెక్టివ్ లు వారి అనుమానపు తీరుని గమనించి పట్టుకొని నింధుతులిద్దరిని విచారణ చేయగా వారి దొంగతనం వెలుగు చూసింది . ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారువారు 27 కేబుల్స్ ను దొంగిలించి, అగార్సా చెత్త సామాను కొనుగోలు చేసే కేంద్రంలో ఇరానియన్లకు అమ్మివేశారు. ఈ ఇద్దరి దొంగతనంకారణంగా చమురుక్షేత్రంలో మూడు రోజుల పాటు ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ నష్టం విలువ 46,000 కువైట్ దినార్ల నష్టంగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







