బిక్షాటన చేస్తున్న యువతిని అదుపులోనికి తీసుకొన్న పోలీసులు
- January 31, 2018
కువైట్: యాచన సంపూర్ణంగా నిషేధం ఉన్న కువైట్ లో ' బాబ్బబని ' ఏ ఒక్కరూ అడుక్కోరాదు. కువైట్ దేశంలో అదో తీవ్రమైన నేరం. ముబారకియాలో బుధవారం ఉదయం ఓ 17 ఏళ్ళ అమ్మాయి పలువురిని డబ్బులు ఇవ్వమని యాచిస్తున్నట్లు పోలీసులు గమనించారు. దాంతో వారు ఆమెను వెంటనే అరెస్టు చేశారు. సందర్శన వీసాతో దేశంలోకి ప్రవేశించిన ఆమె బిక్షాటన ద్వారా జీవనం గడుపుతున్నట్లు విచారణలో తెలుసుకొన్నారు. 63 కువైట్ దినార్ల డబ్బు ,ఇతర గల్ఫ్ కరెన్సీలను ఆమె వద్ద గుర్తించారు. ఆ యువతిని విజిట్ వీసాతో కువైట్ లోనికి తీసుకొచ్చిన యజమానిని పోలీసులు ప్రశ్నించనున్నారు .
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







