మయన్మార్: నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..

- February 01, 2018 , by Maagulf
మయన్మార్:  నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..

యంగూన్ : మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్అంగ్‌సాన్ సూకీ నివాసం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో సూకీ ఇంట్లో లేరని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్‌టయ్ తెలిపారు. సూకీని లక్ష్యంగా చేసుకుని జరిపిన అరుదైన దాడిగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com