జాతరకు సీఎం
- February 01, 2018
మేడారం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం మహాజాతర పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గం టలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. 1.15గంటలకు మేడారంకు చేరుకుంటారు. 1.25గంటలకు మేడారం జాతర ప్రాంగణంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు. 1.25గంట ల నుంచి 1.45గంటల వరకు జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని తల్లులకు కానుకగా ఇస్తారు. 2.10గంటలకు పోలీసు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.10గంటల నుంచి 3గంటల వరకు భోజనంచేసి విశ్రాంతి తీసుకుంటారు. 3.05గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణం అవుతారు. సీఎం రాక సందర్భంగా జాతర ప్రాం గణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







