మిస్ పాపులర్ టైటిల్ వేటలో తెలుగమ్మాయ్ రీతూ రావ్
- February 02, 2018ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 పోటీల్లో 19 ఏళ్ళ తెలుగమ్మాయి రీతూరావు 'మిస్ పాపులర్' కేటగిరీ కోసం బరిలో నిలిచింది. లోనావాలో ప్రస్తుతం పోటీల కోసం సన్నద్ధమవుతోంది రీతూ రావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రీతూ రావు, ఈ పోటీల కోసం తనకు తెలుగువారందరి మద్దతు కావాలని కోరుతోంది. ఫిబ్రవరి 6న ముంబైలోని మహాకవి కాలిదాస్ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగుతాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, డైరెక్టర్ అర్భాజ్ ఖాన్, మోడల్ ఆర్యన్, బాలీవుడ్ సింగర్ షిబానీ కశ్యప్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ రావు తండ్రి, ఓ ఎంఎన్సీ కంపెనీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి సుజాతారావు ఎంటర్ప్రెన్యూర్. కళా నిలయం పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారామె. రితూ రావ్ సోదరి రిహా రావ్ 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు రీతూ రావ్ అందాల పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి