U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!
- February 03, 2018
భారత్ క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అ న్ని విభాగాల్లో రాణించి చక్కని ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ ను అందుకొన్నది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయ సాధించింది. జట్టులోని ఒక్కొక్క సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సెమీఫైనల్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన వెంటనే భారత యువ జట్టుకు నజరానా ఇస్తామని బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







