యు.ఏ.ఈ లోని అజ్మాన్ లో అంగరంగ వైభవంగా 'శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం'
- February 03, 2018
యు.ఏ.ఈ:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అజ్మాన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ ఈ ఉత్సవానికి వేదికయ్యింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 14 వేల మందితో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓం నమో వెంకటేశాయ నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సంవత్సరం కల్యాణంతో పాటు పుష్ప యాగం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మరియు నృత్యాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి ఇంత పెద్దయెత్తున భక్తులు హాజరవడం, ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం గొప్ప విషయం. 'సంప్రదాయం' టీం వారి ఆధ్వర్యంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుపతి నుంచి పరదాల మణి,శశిధర్ బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో APNRT మెంబర్షిప్ డ్రైవ్ కి అనుమతి ఇచ్చిన 'సంప్రదాయం' టీం వారికి APNRT కో-ఆర్డినేటర్స్ ధన్యవాదాలు తెలిపారు.


















తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







