సరస్వతీ దేవికి తుది వీడ్కోలు:మెగాస్టార్
- February 03, 2018
ప్రముఖ నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల (78) శనివారం హైదరాబాద్ లోని మణికొండలోని సొంత ఇంటిలో మరణించారు. ఆమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ సిటీలో లేనందున ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తనకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు తో అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. లక్ష్మీదేవి మృతి పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పేరు లక్ష్మీదేవి అయినా నా పాలిట.. సరస్వతీ దేవి. ఆ రోజు ఆమె చెప్పిన పాఠాలే నా పాఠవాలకు మూలం... ఆమె నాకు నటనలో నేర్పిన మెలకులవలే నాలోని నటుడికి మెలకువలు.. ఈ రోజు నేను ఎంతో మందికి అభిమాన హీరో అయినందుకు ఎంత సంతోషపడతానో... లక్ష్మీదేవి గారి శిష్యుడిని అని చెప్పుకోవడానికి అంత గర్వపడతాను. అటువంటి నా గురువు ఈ రోజు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం నాకు తీరని లోటు... తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి నటుడుకి లక్ష్మీదేవి మరణం ఎంతో బాధకలిగించే వార్త... బరువైన క్షణాలు.. అలా బరువెక్కిన నా హృదయంతో నా చదువులమ్మకి కన్నీటి తో తుది వీడ్కోలు పల్కుతున్నా..అని చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం