రివ్యూ: ఛలో
- February 03, 2018తారాగణం : నాగశౌర్య, రేష్మిక, నరేష్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం : మహతి స్వర సాగర్
నిర్మాత : ఉషా ముల్పూరి
దర్శకత్వం : వెంకీ కుడుముల
విడుదల తేదీ: 2 ఫిబ్రవరి 2018
నాగశౌర్య మంచి నటుడు అనిపించుకున్న సినిమాలున్నాయి కానీ మంచి హిట్ అనిపించుకున్న సినిమాలు తక్కవుగా ఉన్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే కథల్లో నాగశౌర్య ఎక్కవుగా కనిపించలేదు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ఛలో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ అండ్ సాంగ్స్ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి. మరి అంచనాలను ‘ఛలో ’ అందుకుందో లేదో చూద్దాం...
కథ:
చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఏడుపు ఆపటానికి కనిపించిన వాళ్ళని కొట్టించి ఏడుపు ఆపేవాడు హరి (నాగశౌర్య) తండ్రి ( నరేష్). ఆ అలవాటు హారి తో పాటు పెద్దదయి గొడవలేందే రోజు గడవని పరిస్థితికి వచ్చింది. ఈ అలవాటును మాన్పించాలని ఆంధ్ర, తమిళనాడు సరిహాద్దులో ఉండే తిరుప్పురం అనే కాలేజి కి పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ ఊరిలో ఉండే తెలుగు తమిళులకు ఒకరంటే ఒకరికి పడదు. అదే కాలేజ్ లో చదువుతున్న కార్తిక ను ప్రేమిస్తాడు హరి. కార్తిక తమిళ ప్రజలకు నాయకత్వం వహించే లీడర్ కూతురు. తెలుగు వాడంటేనే పడని ఆ లీడర్ తన కూతురును తెలుగు వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తాడా..? కార్తిక ను కాపాడటానికి ఊరిని ఒకటి చేయాలనే హరి ప్రయత్నం నెరవేరిందా..? అనేది మిగిలిన కథ..?
కథనం:
ఏ ప్రేమకథకైనా కామన్ గా పెద్దలు అడ్డు వస్తారు. అందుకే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అయినా ఇందులో హీరో క్యారెక్టర్ ని దర్శకుడు బిల్డ్ చేసిన విధానం బాగుంది. చిన్నప్పటి నుండి గొడవలంటే ముందుడే హరి ని తీసుకెళ్ళి నిత్యం కొట్టుకునే ఒక ఊరిలో పడేసాడు. దీనికి తోడు తెలుగువాడంటే అసలు పడని తమిళ లీడర్ కూతరి ప్రేమలో దింపాడు. కథనం ఆసక్తికరంగా మారడానికి ఈ బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ‘ఛలో’ కి ప్రెష్ లుక్ తెచ్చాడు దర్శకుడు వెంకీ. ఇక కథలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వరకూ కథ మామూలుగానే ఉంది. కానీ బస్ తిరుప్పరం వైపు కి మళ్లాక కథలో కాస్త ప్రెష్ నెస్ ఎంటరయ్యింది. గొడవలు పడే ఊరులు తెలుగు తెరకు కొత్తవి కాకపోయినా గొడవలకు కారణం కొత్తగా ఉంది. ఇక కాలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీలు చాలా చూసినా ఈ బ్యాక్ డ్రాప్ కామెడీ ని ఇంత వరకూ చూడలేదు. తమిళ స్టూడెట్స్ కి లీడర్ సత్య చేసిన పనులు ఆద్యతం నవ్వించాయి. కమెడియన్ సత్య కెరియర్ ‘ఛలో’ ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. ఇక క్లాస్ రూమ్ సన్నివేశం లో పోసాని నటన ఆకట్టుకుంది. వెంకీ రాసుకున్న సన్నివేశాలు, డైలాగ్స్ కథనంలో ని పాయింట్ ని బాగా ఎలివేట్ చేసాయి. ఛలో సత్య కామెడీ పెద్ద అసెట్ గా మారింది. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గ క్యారెక్టర్ లో సత్య చెలరేగిపోయాడు. హీరో తమిళవాడనే భ్రమలు తొలిగిపోయిన సన్నివేశంలో అతని నటన కడుపుబ్బ నవ్విస్తుంది. కాలేజ్ లో రోటీన్ లవ్ ట్రాక్ లు కాకుండా హీరోయిన్ పాత్ర కు కొంత ప్రెష్ నెస్ ని యాడ్ చేసింది. ఇంటర్వెల్ కి కథను మంచి ట్విస్ట్ తో ఆపాడు దర్శకుడు. తర్వాత హీరో ప్రేమకోసం పోరాడాల్సిన రోటీన్ పరిస్థితుల నుండి వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు పెద్ద రిలీఫ్ గా మారింది. అతను కనపడ్డ ప్రతి సన్నివేశం థియేటర్స్ లో నవ్వులు హోరెత్తాయి. అతని క్యారెక్టరైజేషన్ ని రాసుకోవడంలో దర్శకుడు, ప్రజెంట్ చేయడంలో వెన్నెల కిషోర్ నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు. సినిమాని కామెడీ ట్రాక్ మీద నడపాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు కాబట్టి కథలో ప్రతి మలుపులో కూడా నవ్వలు పండాయి. కథలోని మెయిన్ ట్విస్ట్ కూడా అందుకు అతీతం కాదు. అది ప్రేక్షకులు ముందే ప్రిపేర్ అవ్వకపోతే కాస్త నిరుత్సాహం కలుగుతుంది. పాటల విషయానికి వస్తే ‘ చూసి చూడంగానే నచ్చేసావే’ పాట ఛలో ఆల్బమ్ లో గుర్తిండిపోతుంది. హీరోయిన్ రష్మిక అందం, చలాకీ తనం కార్తిక పాత్రను మరింత ఆకర్షణగా మార్చాయి. కమర్షియల్ హీరోయిన్ కుండే అన్ని లక్షణాలను తొలిసినిమాతో చూపించింది. నాగశౌర్య పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. హీరో కదా అని భారీ పోరాటాల జోలికి వెళ్ళకుండా సహజంగా అనిపించే హీరోయిజం తోనే సినిమాలో కనిపించాడు. తన కెరియర్ కి తానే నిర్మాత అయి కొత్త టర్న్ ఇచ్చుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ జనరేషన్ దర్శకులలో కామెడీ మీద గ్రిప్ కనబరిచే వారు తక్కువుగా ఉన్నారు. అనిల్ రావిపూడి తర్వాత వెంకీ లో ఆ గ్రిప్ కనిపించింది. సినిమా లాస్ట్ షాట్ లో ఆర్టిస్ట్ లు అందరూ నవ్వుతారు.. కానీ వీరు మాత్రం సిన్సియర్ గా సినిమా అంతా నవ్వించారు.
చివరిగా:
అన్ లిమిటెడ్ ఫన్ కి ‘ఛలో’
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!