19 మంది అక్రమ మైగ్రెంట్స్‌ని అరెస్ట్‌

19 మంది అక్రమ మైగ్రెంట్స్‌ని అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ కోస్ట్‌ గార్డ్‌ విభాగం, 19 మంది అక్రమ మైగ్రెంట్స్‌ని అరెస్ట్‌ చేసింది. బోటు ద్వారా వీరు సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుండడంతో అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 19 మంది చొరబాటుదారులతో కూడిన బోట్‌ని తాము గుర్తించామనీ, ఆ బోటు సహా వారందర్నీ అరెస్ట్‌ చేయడంలో సఫలమయ్యామని రాయల్‌ ఒమన్‌ పోలీసులు వివరించారు. కోస్ట్‌ గార్డ్‌ విభాగం సేవల్ని ఈ సందర్బంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అభినందించింది. 

 

Back to Top