మాజీ భార్యను ముక్కలుగా నరికి.. సూట్ కేసు లో పెట్టి..
- February 03, 2018
రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం మంచితనం మాయమైపోతున్నాయి. మాజీ భార్యను కోపం పట్టలేక చంపిన.. కేసులో భారత సంతతికి చెందిన అశ్విన్ దౌడియా (51) కు శుక్రవారం లండన్ కోర్టు 18 ఏళ్ళు కఠిన కారాగార శిక్షను విధించింది.
లీచెస్టర్ లో నివాసం ఉంటున్న అశ్విన్ కిరణ్ దంపతులు 2014 లో విడాకులు తీసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. విడాకులు తీసుకొన్నా.. వీరిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే 2017 లో కిరణ్ దౌడియా (46) ఆన్ లైన్ లో డేటింగ్ సైట్ లో తన వివరాలను ఇచ్చింది. దీంతో అశ్విన్ తన మాజీ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. పట్టలేని కోపంతో ఆమె పీకను గట్టిగా నొక్కి మెడను విరిచేశాడు. దీంతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నది. భార్య శవాన్ని చూసిన అశ్విన్ పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు తెలివిగా ఆలోచించి... ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. ఓ సూట్ కేసు లో పెట్టాడు. అనంతరం ఆ సూట్ కేసును పట్టుకొని వెళ్ళి ఓ లోయలో పడేసి.. ఏమీ తెలియని అమాయకుడిలా ఇంటికి వచ్చాడు. పిల్లలకు తల్లి ఆఫీస్ కు వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని చెప్పాడు... పోలీసులకు మిస్సింగ్ కేసు గా ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అప్పుడు అశ్విన్ ఓ సూట్ కేసును ఎక్కడికో తీసుకొని వెళ్ళడం కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అశ్విన్ ను తమదైన స్టైల్ లో విచారణ చేయగా తన నేరం అంగీకరించాడు.. కానీ తన మాజీ భార్యను కావాలని చంపలేదని చెప్పాడు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..