విశాఖలో సందడి చేసిన తరుణ్
- February 05, 2018
కొమ్మాది, న్యూస్‌టుడే: తన మొదటి సినిమా నుంచి విశాఖతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు హీరో తరుణ్. తన కొత్త చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ' విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకొస్తోందని చెప్పారు. రామ్ ఎంటర్‌ట్రైనర్స్, అభిరామ్ బ్యానర్‌పై నిర్మించిన 'ఇది నా లవ్‌స్టోరీ' యూనిట్ సోమవారం కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించింది. తరుణ్ మాట్లాడుతూ యువత కోసమే తీసిన ఈ చిత్రాన్ని రమేష్‌గోపి దర్శకత్వంలో ఈ నెల 14న (ప్రేమికుల దినోత్సవం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు. దీనిని విజయవంతం చేయాలన్నారు. తరుణ్ విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుని వారిని మరింత ఉత్సాహపరిచారు. దర్శకులు రమేష్‌గోపి, కళాశాల ఎఫ్‌డీ మురళీకృష్ణంరాజు, సీఏవో ఎస్‌ఎస్‌వర్మ, ఏజీఎం రామరాజు, శ్రీచైతన్య ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎన్.వి.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







