స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....

- February 06, 2018 , by Maagulf
స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....

దుబాయ్ : కొల్లగొట్టిన ప్రజాధనంను స్విస్ బ్యాంకులలో దాచుకోవడం పాత విధానం కాగా  అక్రమంగా సంపాదించింది దుబాయ్ లో కొందరు విలాసమైన ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి దాచుకోవడం పరిపాటైంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖులు కొందరు దుబాయ్‌లో పలుచోట్ల అత్యంత ఖరీదైన విల్లా(ఇళ్లు)లు కొన్నారని జియో న్యూస్ అనే మీడియా సంస్థ సోమవారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వీరు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా  118 దేశాలకు చెందిన 34 వేల సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో వారు ఖరీదైన భవంతులు కొనుగోలు చేశారని ఆ వార్త పేర్కొంటుంది. మొత్తం 34  వేల ధనిక కుటుంబాలు నివసించే ఆ విల్లాల్లో కేవలం పాకిస్తాన్‌ కుటుంబాలే 7వేలు ఉన్నాయంటోంది. వీరిలో ముఖ్యంగా రాజకీయనాయకులు, మాజీ న్యాయమూర్తులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు , లాయర్లు, గాయకులు, నటులు ఇలా పేరొందిన చాలా మంది పాకిస్తానీయులు 11లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దుబాయ్‌లో ఆస్తులను  కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com