మావ పై అల్లుడు కర్రతో దాడి ...ఆత్మరక్షణ కోసం తప్పలేదంటున్న నిందితుడు
- February 06, 2018
కువైట్: పిల్ల నిచ్చిన మావను ఒక బలమైన మందపాటి పొన్నుకర్రతో ఎముకలు విరిగేటట్టు చితకకొట్టాడా అల్లుడు. పైగా ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేయాల్సివచ్చిందని నిజాయితీగా ఒప్పుకొంటున్నాడు. ఈ వారాంతంలో తనంతట తానే లొంగిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నానని ఈ లోపునే మీరు పట్టుకొన్నారని పోలీసులతో నిష్ఠూరంగా నిందితుడు తెలిపాడు. శరీరంపై వివిధ ప్రాంతంలో ఎముకలు చిట్లిన పరిస్థితిలో బాధితుడిని చికిత్స కోసం జహ్రా ఆసుపత్రికి తరలించినట్లు భద్రతాధికారులు తెలిపారు. తన అల్లుడు ఎందుచేతనో ఆగ్రహించి జహ్రాలో తనను పరుగులు పెట్టించాడని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. రాహాయాలో అనుమానితుడిని జహ్రా డిటెక్టివ్ లు గుర్తించగలిగారు, వెంటనే ఆ ఘరానా అల్లుడిని అరెస్టు చేసి ఈ కేసు విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..