మస్కట్‌లో 5 రోజులపాటు రోడ్డు మూసివేత

- February 06, 2018 , by Maagulf
మస్కట్‌లో 5 రోజులపాటు రోడ్డు మూసివేత

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ బాబ్‌ అల్‌ ముతైబ్‌ రోడ్‌ని ఐదు రోజులపాటు మూసివేయనున్నారు. ముట్రా దగ్గర క్యాపిటల్‌లోని ఈ రోడ్డుని మెయిన్‌టెనెన్స్‌ కోసం మూసివేస్తున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీసుల సహకారంతో బాబ్‌ అల్‌ ముతైబ్‌ స్ట్రీట్‌ని మస్కట్‌ గేట్‌ తర్వాత ముట్రా వైపు వెళ్ళే దారిలో మూసివేస్తున్నామనీ, అవసరమైన మెయిన్‌టెనెన్స్‌ కోసం ఈ మూసివేత జరుగుతోందని ఐదు రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుందని మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్ని ఎంచుకోవాలనీ, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com