హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన మసీదులకు మరమ్మతులు

- February 08, 2018 , by Maagulf
హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన మసీదులకు మరమ్మతులు

 

హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన మసీదులకు మరమ్మతులు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. కనీసం సున్నం వేయలేని స్థితిలో ఉన్న మసీదులు, ఈద్గాలను సుందరీకరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి 129 మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 60 మసీదులకు రూ. 31. 91 లక్షలు మంజూరు చేయగా, మరో రూ.45 లక్షలతో 63 ప్రార్థనా మందిరాల స్థితిగతులను మార్చబోతున్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 283 ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు చేపట్టేందుకు అవకాశముండగా, ప్రస్తుతానికి 123లకే చేపట్టారు. త్వరలోనే మిగతా వాటి రూపురేఖలు సైతం మార్చబోతున్నారు. వరదలా నిధులు.. : జిల్లాలో మసీదులు, ఈద్గాల మరమ్మతులకు మూడు విడతలుగా నిధులు మంజూరుచేసింది. 2015 జూన్ 1వ తేదీన రూ.63.10 లక్షలు, 29వ తేదీన రూ.1.04 కోట్లు మంజూరు చేసింది. వీటితో కొంత మేర మరమ్మతులు చేపట్టారు. మరో విడతగా 2017 మే 19వ తేదీన రూ.

1. 67 కోట్ల నిధులు రాష్ట్రప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధుల సద్వినియోగానికి జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా చర్యలు చేపట్టారు.

2017 అక్టోబర్ 20వ తేదీన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదుల్లో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ ప్రతిపాదనలను నియోజకవర్గాల వారిగా, ప్రాధాన్యత క్రమంలో వివరాలను పంపించాలన్నారు. నియోజకవర్గాల వారిగా తయారుచేసిన జాబితాను తహసీల్దార్ల పర్యవేక్షణ కోసం పంపించాలని, తహసీల్దార్లు పరిశీలన పూర్తిచేసిన వాటికి నిధులిచ్చేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలో 854 మసీదులు, ఈద్గాల మరమ్మతులకు ప్రతిపాదనలు అందాయి.

వీటిని తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా 283 మసీదులు, ఈద్గాలు అర్హత గలవిగా తేలాయి. వీటి కోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించగా, 123 మసీదుల మరమ్మతులకు అనుమతులిచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com