విజయవాడ చేరుకున్న చంద్రబాబు
- February 08, 2018
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయన నిన్న దుబాయ్ వెళ్లారు. కాగా... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... దుబాయ్లో ఉన్న చంద్రబాబు అక్కడినుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. కాగా... ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విభజన హామీలపై రెండు రోజులుగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఏమాత్రం మేలు చేసేలా లేకపోవడంతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!