మూడురోజుల విదేశీ పర్యటనకు ప్రధాని
- February 08, 2018
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ పర్యటించిన ఆరు నెలల అనంతరం ప్రధాని మోడీ శుక్రవారం నుండి మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్నారని ఢిల్లీ అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆయన పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్లకు వెళ్లనున్నట్లు తెలిపారు. కాగా, భారత్ నుండి పాలస్తీనాకు వెళ్లిన మొట్టమొదటి ప్రధాని మోడీ పర్యటన చరిత్రలో నిలుస్తుందని విదేశీ వ్యవహారాల అభివృద్ది శాఖా సంయుక్త కార్యదర్శి బి. బాల భాస్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుండి జోర్డాన్ రాజధాని ఒమన్‌కు వెళ్లి అక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో వున్న రామల్లాకు ఛాపర్ ద్వారా చేరుకుంటారని తెలిపారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్ష ప్రధాన కార్యాలయాలను నిర్వహిస్తున్న వెస్ట్ బ్యాంక్‌లోని ఈనగరం పాలస్తీనా రాజధానిగా కూడా పనిచేస్తుండటంతో ప్రధాని ఈ పర్యటన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రధాని ఈ పర్యటన ప్రత్యేకం కానున్నదని అధికారి తెలిపారు. కాగా, ఈ పర్యటన సోమవారంతో ముగుస్తుందని తెలిపారు. గతేడాది భారత్‌ను పర్యటించిన పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ప్రధానిని తమ దేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్షుడు అబ్బాస్‌తో చర్చలకు ఎదురుచూస్తున్నానని, పాలస్తీనా ప్రజలకు, అభివృద్ధికి మద్దతునివ్వనున్నానని గురువారం సాయంత్రం మోడీ చివరి ప్రసంగం ప్రకటనలో మోడీ పేర్కొన్నారు.
కాగా, ఇది వారి నాల్గవ సమావేశం కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!