రికార్డ్ వ్యూస్.. రంగస్థలంలో సమంత ఎలా ఉందంటే!
- February 09, 2018
రొటీన్ లా కాకుండా డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ , అయన దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ చిట్టిబాబుగా చేసిన రామ్ చరణ్ పాత్రని తప్ప.. సమంతను మాత్రం అసలు చూపించలేదు. అయితే నిన్న రేపు 11 గంటలకు రామలక్ష్మిని చూడండి అనే పోస్టర్ ను రీలీజ్ చేశారు.. శుక్రవారం సరిగ్గా 11 గంటల ఒక్క నిమిషానికి వచ్చిన రంగస్థలం టీజర్ లో సమంత అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు.. ముఖ్యంగా ఈ టీజర్ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. అందులో రామలక్ష్మి సైకిల్ తొక్కుకుంటూ వచ్చే పాత్రలో సమంత చేసిన నటన ఈ సినిమాకు పెద్ద హైలైట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కొద్దీ రోజుల క్రితం వచ్చిన రంగస్థలం టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే కేవలం 24 నిమిషాల్లోనే రంగస్థలం రెండవ టీజర్ 80,451 వ్యూస్ ను సొంత చేసుకుంది. అలాగే ఫ్రిబ్రవరి 13 న మొదటి పాట విడుదల అవుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







