ట్రంప్‌కు బడ్జెట్ విషయంలో భారీ షాక్..

- February 09, 2018 , by Maagulf
ట్రంప్‌కు బడ్జెట్ విషయంలో భారీ షాక్..

అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది.  అమెరికా  మరోసారి షట్‌డౌన్‌ అయింది. దీంతో కీలకమైన బిల్లు అమెరికా సేనేట్‌లో వీగిపోయింది. షట్‌డౌన్‌ ప్రభావంతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి  ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు.  ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది.కానీ బిల్లు వీగిపోయింది. ఇదిలావుంటే రోజుల వ్యవధిలోనే అమెరికా షట్‌డౌన్‌ అవ్వడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. 20 రోజుల కిందట కొత్త బడ్జెట్ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సేనేట్ ద్రవ్య వినమయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. ఆ కారణంగా ఫెడరల్ ఆఫీసులన్నీ మూసివేతకు గురయ్యాయి. అనేక కీలక అంశాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వానికి చేయూతనిచ్చే నిధులకు సంబంధించిన బిల్లుకు డెమోక్రాట్లు అడ్డుతగిలారు. దాంతో కీలక బిల్లులు ఆగిపోయి ప్రభుత్వం షట్‌డౌన్‌ అయింది.. ఇప్పుడు కూడా సేనేట్‌ సభ్యుల మద్దతు లేక బడ్జెట్ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యామ్నాయాలపై ద్రుష్టి సారించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com