2020 కల్లా దుబాయిలో డ్రైవర్ రహిత కార్లు

- November 25, 2015 , by Maagulf
2020 కల్లా దుబాయిలో డ్రైవర్ రహిత కార్లు

 

 

అభివృద్ధి చెందిన సాంకేతికతను వాహనాలను నడపడానికి ఉపయోగించాలన్న ఆలోచనను ఎక్స్పో 2020 లో వాడటానికి,  దుబాయిలో స్వయం  చాలక  వాహనాలను ఉపయోగించాలనే దీర్ఘాలోచనలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ (RTA )ఉన్నట్టు సంస్థ చైర్మన్ మత్తెర్ అల్ తయార్ తెలిపారు. ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా నూర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ లో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో ప్రదర్శించారు. పరిస్థితులను ఎదుర్కొనే పరిమిత సామర్ధ్యం గల మానవ చోదకుని వలె కాకుండా, స్వయంచాలిత కార్లు, చలనంలోఉన్న, చలన రహితమైన,  వివిధ శ్రేణులలో ఉన్న వస్తువులను 360 డిగ్రీల దృష్టి కోణంలో  పసిగట్టగలవని నిపుణులు వివరించారు. ఈ ఎగ్జిబిషన్, ఈ వారంలో ప్రతిరోజూ తెరువబడే ఉంటుందని కూడా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com