వర్షా కాలంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ

- November 25, 2015 , by Maagulf
వర్షా కాలంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ

 

కతార్ వాతావరణ శాఖ వారి అంచనాలప్రకారం, దేశంలో అవరించిఉన్న అల్పపీడనం వలన దోహాతో సహా దేశం లోని అనేక ప్రాంతాలలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలు, ఈరోజు రేపు కూడా కొనసాగనున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారులు అన్నారు. వర్షం వలన రోడ్లు జారుగా మారతాయని, అందువల్ల వాహనంపై  నియంత్రణ కోల్పోవచ్చని; నీరునిండిన రోడ్లపై మార్గం ఎంతలోతులో ఉందొ తెలియనందున వేగం తగ్గించి నడపాలని; సడన్ బ్రేక్ లను వేయటం వలన వాహనం పక్కకు జారిపోయే ప్రమాదముండడం వలన జాగ్రత్త వహించాలని; అంతేకాకుండా బయలుదేరేముందు వాహనం యొక్క చక్రాలు, విండ్ షీల్డ్ వైపర్స్ వంటి వాటిని సరి చూసుకోవాలని; హాజర్డ్ లైట్లను వర్షం పడుతున్నపుడు ఉపయోగించకుడా, కేవలం ప్రమాదం ఏదైనా జరిగినపుడు,అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలని వారు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com