కొరియర్‌లో పులి పిల్ల దాన్ని చూసి పోలీసులు షాక్..
- February 09, 2018పశ్చిమ మెక్సికో దేశమైన జాలిస్కోలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు నెలల వయసున్న పులి పిల్లను ఓ వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి కొరియర్ చేశాడు. దానికి ఊపిరాడ్డం కోసం డబ్బాకి రంద్రాలు కూడా చేశాడు. అయితే కొరియర్ ఆఫీసుకు చేరుకున్న ఆ డబ్బా దగ్గరకి పోలీస్ జాగిలం చేరుకుని అక్కడే ఉండి అరుస్తోంది. అర్థం కాని సిబ్బంది డబ్బా ఓపెన్ చేసి చూశారు. అందులో ముడుచుకుని నీరసంగా పడి ఉన్న పులి పిల్లను చూశారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణా అధికారులకు సమాచార మందించారు. పులిపిల్ల ఫొటోలను నెట్‌లో షేర్ చేశారు పోలీసులు. నెటిజన్స్ స్పందిస్తూ పులిపిల్లను కాపాడిన పోలీసులకు, జాగిలానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే ఆ డబ్బా ఎక్కడినుంచి వచ్చింది, ఎవరు పంపించారు అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!