ఓ మహిళ..ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన నలుగురు పాకిస్తానీ నిందితులకు శిరచ్చేదనం
- February 09, 2018
సౌదీఅరేబియా: ' కంటికి కన్ను ..పంటికి పన్ను ' అనే రీతిలో న్యాయం ఆ దేశాలలో ఖచ్చితంగా అమలవుతుంది కనుక ఏమైనా దారుణాలకు పాల్పడాలంటే నేరస్థులు గజ గజ వణికిపోతారు. ఎంతటి అకృత్యమైన కాసులు వెదజల్లి సులువుగా తప్పించుకోవడం అలవాటైపోయిన దేశాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన కొందరు తమ తమ వికృత నైజాలను చూపి ఆ తదుపరి ఆ దేశంలో అమలయ్యే శిక్షలకు బలైపోతుంటారు. ఓ మహిళ .ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన గురువారం నలుగురు పాకిస్తానీ నిందితులకు అధికారులు శిరచ్చేదనం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. ఆ నేరస్థులు ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆమె కొడుకుపై సైతం అసహజ రీతిలో లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఇంట్లో చొరబడి మహిళను బంధించి ముందుగా విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత ఆమెపై నలుగురు లైంగికదాడి చేశారన్నారు. చివరికి ఆమె కొడుకుపై కూడా లైంగికదాడి చేసినట్లు ఆధారాలు దొరికాయని వారు తెలిపారు. చనిపోయిన మహిళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నేరస్థులను సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హజరుపరచగా .కోర్టు వారికి భూమిపై జీవించే హక్కు లేదని తీర్పు ఇచ్చింది. 2018 లో కనీసం రెండు నెలలు పూర్తికాక ముందే ఇప్పటివరకు మొత్తం 20 మందికి సౌదీ న్యాయస్థానం మరణశిక్ష విధించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







