ఫ్రాన్స్ లో ఈఫిల్ టవర్ మూసివేత!
- February 09, 2018
ఫ్రాన్స్:ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ మంగళవారం మూతపడింది. ప్రతిరోజు వేలమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. గతేడాది 70 లక్షలకు పైగా పర్యాటకులు ఈ అద్భుతాన్ని సందర్శించగా ఇందులో 80 శాతానికి పైగా విదేశీయులు ఉన్నారు. అయితే ఫ్రాన్స్ కార్మిక చట్టాలు తమకు అడ్డుగా నిలుస్తున్నాయని, దీంతో తాము అధిక ఒత్తిడికి గురవుతున్నాయని కార్మికులు ధర్నా చేశారు. ఈ కారణంగా ఈఫిల్ టవర్ ను మంగళవారం మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈఫిల్ టవర్ కు వచ్చే సందర్శకులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల కారణంగానే నిరుద్యోగిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మికులు వాపోయారు. వర్కర్స్ ఎవరూ రాకపోవడంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







