విఐపి నెంబర్‌ కోసం 200కె ఒమన్‌ రియాల్స్‌ బిడ్‌

- February 09, 2018 , by Maagulf
విఐపి నెంబర్‌ కోసం 200కె ఒమన్‌ రియాల్స్‌ బిడ్‌

మస్కట్‌: డైమండ్‌ గ్రేడ్‌ మొబైల్‌ నెంబర్‌ కోసం 190,000 ఒమన్‌ రియాల్స్‌ బిడ్‌ ధర పలికింది. బిడ్‌ ముగియడానికి 14 గంటలకు ముందుగా ఇంత పెద్ద ధర పలకడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 7111 1111 నెంబర్‌ కోసం ఇంత ధరను వెచ్చించడానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ప్రారంభమయ్యింది. ఒమన్‌టెల్‌, ఓరెడూ టెలికాం ఆపరేటర్లు బిడ్‌ని ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటలతో ఈ బిడ్‌ ముగుస్తుంది. డైమండ్‌ మరియు గోల్డ్‌ నంబర్స్‌ని ఆక్షన్‌ ద్వారా మాత్రమే కేటాయించాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పాస్‌ చేసిన రూలింగ్‌ నేపథ్యంలో ఈ నెంబర్‌ కోసం ఆక్షన్‌ని ప్లాన్‌ చేశారు. ఆక్షన్‌ ద్వారా లభించే మొత్తాన్ని ఛారిటీ కోసం అందించబడుతుందని టిఆర్‌ఎ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com