భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ-2021
- February 10, 2018
దుబాయ్: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. కానీ, ఇందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు. 2021లో భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది ఐసీసీ.
2016లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు పన్ను మినహాయింపు ఇవ్వలేదట. దీంతో ఐసీసీ నిర్వాహకులు 'భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే మాకు పన్ను మినహాయింపు కావాలి అని కోరుతున్నారట. ఎందుకంటే మాకు టోర్నీ నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో పన్ను మినహాయింపు మాకు కాస్త ఊరట ఇచ్చే అంశం' అని తెలిపారు.
దీనిపై ఇప్పటికే బీసీసీఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రీడలను జీవితంలో భాగం చేసుకోమని పిలుపునిచ్చిన ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







