అఖిల్ సినిమాని నిర్మిస్తున్న రానా

- February 10, 2018 , by Maagulf
అఖిల్ సినిమాని నిర్మిస్తున్న రానా

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అందుకున్న రానా ప్ర‌స్తుతం బ‌హుబాషా న‌టుడిగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నాడు. నిర్మాత‌గాను అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. రీసెంట్‌గా సురేష్ మూవీ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను నిర్మించాడు రానా. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శీరత్ కపూర్, శ్రద్ధ శ్రీనాథ్, షాలినీ హీరోయిన్లుగా నటించారు. క్షణం సినిమాతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్కినేని మూడోత‌రం వార‌సుడు అఖిల్ ఇటీవ‌ల హ‌లో సినిమాతో అల‌రించాడు. సినిమా హిట్ టాక్ సాధించినప్ప‌టికి క‌లెక్ష‌న్స్ విష‌యంలో కాస్త డ‌ల్‌గానే సాగింది. ఈ నేప‌థ్యంలో త‌న మూడో సినిమాని రంగ‌స్థ‌లం డైరెక్టర్ సుకుమార్‌తో చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. నాలుగో సినిమాని తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్‌. ఈ రెండు సినిమాల‌ని రానా త‌న ప్రొడ‌క్ష‌న్‌లో నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్‌. త‌న తండ్రి సురేష్ బాబుతో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత రానా దీనిపై పూర్తి నిర్ణ‌యానికి వ‌స్తాడట .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com