నితిన్-పవన్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్
- February 10, 2018
నితిన్-పవన్ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే నితిన్‌కు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నితిన్ నటిస్తున్న సినిమాకే పవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఛల్ మోహన్‌రంగ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు పవన్‌తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నితిన్, మేఘా ఆకాశ్‌లు గంతులేస్తుండడం ఆకట్టుకుంటోంది. 'లై' సినిమా తరువాత నితిన్, మేఘా కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరోవైపు నితిన్ 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో దాదాపు 14 ఏళ్ల తరువాత నితిన్..దిల్‌రాజుతో కలిసి పనిచేస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి