ఆరు ఆహార కర్మాగారాలు, వాటర్ బాట్లింగ్ ప్లాంట్ లను మూసివేసిన సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ

- February 11, 2018 , by Maagulf
ఆరు ఆహార కర్మాగారాలు, వాటర్ బాట్లింగ్ ప్లాంట్ లను మూసివేసిన  సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ

రియాద్ : సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ 2017 చివరి రెండు నెలల్లో ఆరు నీటి ,ఆహార కర్మాగారాలు మరియు 74 ఉత్పాదక కార్యాలయాలు మూసివేసింది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ కార్యాలయం వద్ద మీడియా , అవగాహన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, అథారిటీ ద్వారా గత ఏడాది చివరి రెండు నెలలలో అధికారులు 416 ఆహార ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు సందర్శించారు మరియు పరీక్షల నిమిత్తం 472 ఆహార నమూనాలను తీసుకున్నారు. "అధికారం కూడా 157 బాటిల్ వాటర్-బాట్లింగ్ ప్లాంట్లు మరియు ఐస్ తయారుచేసే కర్మాగారాలలో తనిఖీలు నిర్వహించి  152 నమూనాలను సేకరించింది. అదేవిధంగా 964 ఆహార ఉత్పత్తుల గిడ్డంగులు మరియు పంపిణీ కేంద్రాలను కూడా సందర్శించి అక్కడి నుంచి  53 నమూనాలను సేకరించింది.పలు ఆహార ఉత్పత్తులలో ఉల్లంఘన తేదీలను 21 సంస్థలు మోసగించినట్లు కనుగొన్న అనంతరం వివిధ ఉల్లంఘనలకు సంబంధించి  పాల్పడినట్లు కనుగొన్నారు. ఇక్కడ 1,449 కిలోల ఆహారపదార్ధాలను నాశనం చేశారని అల్ సుల్తాన్ తెలిపారు. ఎటువంటి లైసెన్సలు  లేకుండా ఉత్పత్తి చేసిన 8,860 నీటి బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 11.9 టన్నుల ఆహార ఉత్పత్తులను అధికార నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించారు. తనిఖీ సమయంలో,24 లైసెన్సులను పునరుద్ధరించారు ఆహార కార్యాలయాలను స్థాపించటానికి 18 దరఖాస్తులను అనుమతించగా, ఆహార సంస్థలను నమోదు కి 43 అప్లికేషన్లను  సమీక్షించబడ్డాయి. వాణిజ్యపరమైన మోసాలకు పాల్పడినందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు 10 కేసులను పంపించినట్లు ఆల్-సుల్తాన్ తెలిపారు. అదే  కాలంలో అథారిటీ  237 ఫిర్యాదులు, ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలు అందుకున్నాయని ఆయన తెలిపారు. డిటెక్షన్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి వచ్చిన అధికార నివేదికలలో  పాలపొడి బ్రాండ్లలో  సెలియా వంటి విషపూరిత సూక్ష్మజీవులు కలిగి ఉండవచ్చు. దీంతో గిడ్డంగులలో భద్రపరిచిన 750 క్యాన్లను స్వాధీనం చేసుకుంది. అలాగే  712,000 క్యాన్లను దుకాణాల నుండి ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకొన్నట్లు అల్ సుల్తాన్ వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com