విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్‌ పరీక్ష తప్పనిసరి

- February 12, 2018 , by Maagulf
విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్‌ పరీక్ష తప్పనిసరి

ఢిల్లీ : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబిబిఎస్‌ చదవాలనుకునే వారు సైతం ఇకపై నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో ఉత్తీర్ణులవడం తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అర్హులు మాత్రమే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేలా నీట్‌ను తప్పనిసరి చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా చైనా, రష్యా వంటి దేశాల్లో వైద్య విద్య అభ్యసించేందుకు దాదాపు 7 వేల మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్తున్నారు. వీరు ఎంబిబిఎస్‌ పూర్తి చేసి తిరిగొచ్చాక భారత్‌లో వైద్యునిగా పనిచేయాలంటే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల పరీక్ష ఎఫ్‌ఎంజిఇలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కానీ విదేశాల్లో వైద్య విద్య చదివి వచ్చిన వారిలో 12 నుంచి 15 శాతం మంది మాత్రమే ఎఫ్‌ఎంజిఇలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మిగిలిన వారు అక్రమంగా వైద్యసేవలు అందించడం రోగుల ప్రాణులకు ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అర్హులైన వారు మాత్రమే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్‌ పరీక్షను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com