దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన కొత్త హోటల్‌

- February 12, 2018 , by Maagulf
దుబాయ్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన కొత్త హోటల్‌

దుబాయ్: గల్ఫ్ మెట్రోపొలిస్ దుబాయ్ రికార్డులు సృష్టించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన కొత్త హోటల్‌ను తాము ప్రారంభిస్తున్నట్లు ఆదివారంనాడు ప్రకటించింది.

ఈ గోవెరా హోటల్ 75 అంతస్థులతో నిర్మితమైంది. దాని ఎత్తు 356 మీటర్లు లేదా దాదాపు పావు మైలు ఉంటుంది. అంతకు ముందు ఈ రికార్డు దుబాయ్ జెడబ్ల్యు మారియోట్ మార్క్వీస్‌పై నమోదై ఉంది.

గోవేరా హోటల్ ఎత్తుకన్నా ఇది ఒక్క మీటరు ఎత్తు మాత్రమే తక్కువగా ఉంటుంది. గోవెరా హోటల్ సోమవారంనాడు అతిథుల కోసం తెరుచుకుంటుందని ఎమిరేట్స్ దినపత్రిక ది నేషనల్ రాసింది.

ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా కూడా దుబాయ్‌లోనే ఉంది. ఇది 828 మీటర్ల ఎత్తు ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రేడ్ ఫెయిర్ ఎక్స్‌పో 2020ని నిర్వహిస్తోంది. అప్పటికి ఏడాదికి 20 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించాలనేది లక్ష్యంగా ఉంది.

ఎడారి ప్రాంతమైన దుబాయ్‌ అద్భుతమైన షాపింగ్ మాల్స్‌కకు, పలు లగ్జరీ రిసార్టులకు, ఇండోర్ స్కై రిసార్ట్‌కు ప్రసిద్ధి గాంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com