డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును కువైట్ 1,000 దినార్లకు పెంచాలని ప్రతిపాదనను తిరస్కరణ

- February 12, 2018 , by Maagulf
డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును కువైట్ 1,000 దినార్లకు పెంచాలని ప్రతిపాదనను తిరస్కరణ

కువైట్: ' ఉరుము వచ్చి మంగలం మీద పడినట్లు '  దేశంలో ప్రవాసీయులే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు పెంచాలని కువైట్ ఎం. పి. సోఫా అల్- హాషేము  సమర్పించిన వివాదాస్పద ప్రతిపాదన పార్లమెంట్ ప్యానెల్ ఏకగ్రీవంగా తిరస్కరించింది. డ్రైవర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏ ప్రవాసీయుడైన 500 కువైట్ దినార్లను ఫీజు విధించాలనే ప్రతిపాదన,  500 కువైట్ దినార్లను వార్షిక పునరుద్ధరణ రుసుము మరియు వాహన పత్రాల పునరుద్ధరణకు అదనపు 500 కువైట్ దినార్ల ప్రతిపాదన ప్యానెల్ తిరస్కరించింది. 10 సంవత్సరాల వయస్సు మరియు అంతకంటే ఎక్కువ వాహనాల పత్రాలను పునరుద్ధరించడానికి దరఖాస్తులు తొలగించాలనే ప్రతిపాదన కూడా తిరస్కరించాలని  పిలుపునిచ్చింది. తల్లిదండ్రులకు సమర్పించిన దానికన్నా కుటుంబ వీసా దరఖాస్తులు అనుమతించరాదని ఎం. పి. సోఫా అల్- హాషేము సూచించిన మరొక ప్రతిపాదనను సైతం కమిటీ తిరస్కరించింది, ఆ సందర్శన వీసాఫీజు 100 శాతం పెంచాలి. ప్రవాసీయులకు 10 సంవత్సరాలు గరిష్ట నివాస వీసా నిబంధనను  సిఫారసు చేసింది, దానిలో కొన్ని చాలా ముఖ్యమైన వృత్తులు మినహాయింపుతో ఒకసారి పునరుద్ధరించబడాలని కోరారు.. ప్యానెల్ సభ్యులందరూ మొదటి ప్రతిపాదనను ట్రాఫిక్ రద్దీ రేటును తగ్గించడంలో చాలా అవసరం అని గమనించారుకానీ సంబంధిత ఫీజులు దారుణమైనవి. ప్రవాస  కార్మికులు మెజారిటీ జీతాలను పొందుతున్నారు. అటువంటి ఫీజులకు తగినంత జీతాలు లభించడం లేదని  పానెల్ అభిప్రాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com