తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను ఉపయోగించే వారిపై ఐపీసీలోని సెక్షన్287,336,337,338
- February 12, 2018
ప్రపంచంలో అతి సుందరమైన కట్టడం..ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా చెప్పుకునే 'తాజ్ మహల్' దరిదాపుల్లో డ్రోన్లను ఉపయోగించిన వారిని జైలుకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా భారత దేశంలో తాజ్ మహల్ పై ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు కొంత మంది ప్రజా ప్రతినిధులు తాజ్ మహాల్ పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తాజ్ మహల్ పరిరక్షణ భాద్యత ఎంతైనా ఉందని ఆ మద్య యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
తాజాగా తాజ్ మహల్ చుట్టుపక్కల డ్రోన్లను ఉపయోగిస్తే వారిపై నేరపూరిత అభియోగాలను నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాదిలో సుమారు 20 సార్లు తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను గుర్తించారు. అయితే వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
కాగా, ఆగ్రా నగర ఎస్‌పీ కున్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ...తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను ఉపయోగించే వారిపై ఐపీసీలోని సెక్షన్ 287 (యంత్రసామగ్రి పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం), సెక్షన్ 336 (ఇతరుల జీవితం లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కల్గించడం), సెక్షన్ 337 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కల్గించడం ద్వారా ఇబ్బంది పెట్టడం), సెక్షన్ 338(ఇతరుల జీవితం లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంటుందని అభిప్రాయ పడ్డారు.
భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కేసు నమోదు చేస్తామని ఎస్‌పీ చెప్పారు. "కొత్త నిబంధనల గురించి అతిథులకు వివరించాలంటూ హోటళ్ల యజమానులు, వారి సంఘాలకు తెలియజేస్తున్నాం" అని ఆయన చెప్పారు. డ్రోన్లను వినియోగించకుండా అడ్డుకట్ట వేయగలమని సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ (ఆగ్రా) బ్రిజ్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి