కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 2018 ట్రాఫిక్ గణాంకాలు
- February 12, 2018కువైట్: జనవరి 2018 నాటికి అంతర్గత వ్యవహారాల శాఖ, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం, 2,171,961 మంది ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రాయం నుంచి వెలుపల ప్రాంతాలకు ప్రయాణమయ్యారు. అదేవిధంగా 536,142 మంది కేవలం గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. అలాగే ఇక్కడకు వస్తున్నా పౌరులు సంఖ్య 922,433 చేరుకుంది. ఇంతలో, ఇతర దేశాలకు చెందిన ప్రయాణికుల సంఖ్య 759,619 చేరుకుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జారీ చేసిన వీసాల సంఖ్య 14,319 మంది. వేలిముద్రల ఆధారంగా 85 మంది గతంలో కువైట్ దేశం నుంచి బహిష్కరించబడ్డ వారని ఈ సందర్భంగా గుర్తించారు. ఐదుగురు వ్యక్తులు నకిలీ పాస్‌పోర్ట్ లతో అరెస్టు కాబడ్డారు. 112 మందిని సంబంధించిన అధికారుల వద్దకు పంపబడ్డారు. అదేవిధంగా గతంలో దేశ బహిష్కరణకు గురైన పదిహేను మందిని నిబంధన కాలం ముగిసిన తరువాత కువైట్ దేశంలోకి అనుమతించబడ్డారు, మరో 11 మందిని దేశంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించలేదు.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?