50 శాతం జరీమానా తగ్గింపు: 2 వారాలు మాత్రమే
- February 13, 2018
అబుదాబీలో ట్రాఫిక్ జరీనామాల తగ్గింపు గడువు ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా తమ జరీమానాల్ని క్లియర్ చేసుకోనట్లయితే, చివరి రోజు వరకు ఎదురుచూడకుండా, మిగిలి వున్న 16 రోజుల్లో వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేసుకోవడం మంచిది. మార్చి 1తో ఈ డిస్కౌంట్‌తో కూడిన జరీమానాల చెల్లింపు గడువు ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 2న ఈ ఆఫర్ ప్రకటితమయ్యింది. 2016 ఆగస్ట్ 1 నుంచి 2017 డిసెంబర్ 1 వరకు నమోదైన ట్రాఫిక్ జరీమానాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖైల్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 1 లోగా చెల్లించకపోతే, మార్చి 1 తర్వాత జరీమానాలు ఎలాంటి డిస్కౌంట్ లేకుండా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు తమ వాహనాల్ని నిబంధనలకు లోబడి నడిపితే జరీమానాల సమస్య వుండదని ఆయన చెప్పారు. డిసెంబర్ 1న యూఏఈ నేషనల్ డే సందర్భంగా అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ట్రాఫిక్ జరీమానాలపై 50శాతం డిస్కౌంట్‌ని ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







