ఉల్లంఘన: 562,961 మంది వలసదారుల అరెస్ట్
- February 13, 2018
రియాద్: మొత్తం 562,691 మంది వలసదారుల్ని గత ఏడాది నవంబర్ 1 నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సౌదీ లేబర్ మరియు రెసిడెన్సీ అలాగే బోర్డర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను వీరిని అరెస్ట్ చేశారు. 'ఎ నేషన్ వితౌట్ వయొలేటర్స్' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన క్యాంపెయిన్‌లో ఉల్లంఘనుల్ని గుర్తించి, అరెస్ట్ చేశారు. ఇందులో 382,921 మంది వద్ద చెల్లుబాటయ్యే రెసిడెన్సీ పర్మిట్ లేదు. 127,566 మంది వద్ద సరైన వర్క్ పర్మిట్ లేదు. 62,204 మంది బోర్డర్ సెక్యూరిటీ సిస్టమ్‌కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు యత్నించిన 7,996 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 69 శాతం యెమనీయులు ఉండగా, 29 మంది ఇథియోపియన్స్ ఉన్నారు. 2 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారున్నారు. కింగ్డమ్ నుంచి పారిపోయేందుకు యత్నించిన 501 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారే అనేకరకాలైన నేరాలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







