లెజెండరీ దిలీప్ ఇంట్లో షారుఖ్
- February 13, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్..సోమవారం ముంబైలో లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. ఈ పిక్ ను షారుఖ్ కుటుంబ సభ్యుడొకరు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో షారుఖ్..దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడం ఇది రెండో సారి. షారుఖ్ తన సినిమాల్లో చాలావరకు దిలీప్ కుమార్ నటనను అనుకరిస్తాడన్న ప్రచారం ఉంది. పైగా ఆయన నటన తనను ప్రభావితం చేస్తుందని ఈ సూపర్ స్టార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. లోగడ దిలీప్ అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినప్పుడు కూడా షారుఖ్ ఆయన నివాసానికి వెళ్లి అయన హెల్త్ గురించి వాకబు చేశాడు. దిలీప్ కుమార్ తన 60 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 65 కి పైగా మూవీల్లో నటించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 ఏళ్ళు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







