మస్కట్‌లో ఇళ్ళ కూల్చివేతలు చేపట్టిన మున్సిపాలిటీ
- February 13, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, పాత భవనాల్ని కూల్చివేయడం ప్రారంభించింది. వాడి అల్ బహాయెస్ ప్రాంతంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రూఫ్ ఆఫ్ ఓనర్‌షిప్ గడువు పూర్తయిన భవనాలకు ఫిబ్రవరి 11 డెడ్‌లైన్ ముగియడంతో ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం మునిసిపల్ అధికారులు, సీబ్‌లోనూ యజమానులకు తమ భవనాల కండిషన్‌పై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. యజమానులకు ఫిబ్రవరి 11 లోపు సంబంధిత పత్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో కూల్చివేతలు చేపట్టారు. మునిసిపాలిటీకి చెందిన లెజిస్లేటివ్ రపొసిడ్యూర్స్ ఆధారంగా కూల్చివేతల్ని రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి చేపడుతున్నట్లు మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!