సినీ నటుడు కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్‌ బిరుదు

- February 13, 2018 , by Maagulf
సినీ నటుడు కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్‌ బిరుదు

ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. శాలువా కప్పి స్వర్ణ కంకణధారణతో సత్కరించారు. శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం విశాఖ సాగర తీరంలో టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యాన శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సత్యనారాయణకు ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు సుబ్బిరామిరెడ్డి, ఎంపి, సినీ నటుడు మురళీమోహాన్‌, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు సత్కరించారు. స్థానిక కళాకారులకు శివశక్తి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ బృందంచే పౌరాణిక నాటకం, విజయనగరానికి చెందిన బిఎ.నారాయణ తదితరులచే సంగీత విభాహరి, వివిధ కళాకారులతో నృత్య ప్రదర్శనలు రంజింపచేశాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సిఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com