గత ఏడాది ఒమన్ లో 1,152 బిక్షగాళ్లు అరెస్ట్
- February 14, 2018
మస్కట్ : 2017 లో ఒమన్ దేశంలో 1,152 మంది యాచకులు అరెస్టయ్యారు. సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన బిక్షాటన వ్యతిరేక బృందం నిర్వహించిన1,200 కార్యక్రమాలలో ఇది జరిగింది.మత్యాట్, దక్షిణ , ఉత్తర బాటినాలో గవర్నరేట్ల పరిధిలో అత్యధిక మంది బిక్షాటన చేసేవారు జైలుకి పంపబడ్డారు. వీరిలో 225 మంది ఒమాన్ దేశస్థులు ఉన్నారు. (152 మంది పురుషులు, 73 మంది స్త్రీలు) మరియు 927 ప్రవాసీయులు (569 మంది పురుషులు, 331 మంది స్త్రీలు) ఉన్నారు. రమదాన్ కాలంలో పలువురు యాచకులు అరెస్టయ్యారు. సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి ' మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ , బిచ్చగాళ్ళు రమదాన్ పండుగ సమయంలో యాచన చేయడం ఒక మంచి అవకాశంగా మలుచుకొన్నారన్నారు. ప్రజలు ఆ సమయంలో పేదలకు దానం చేయాల్సిన అవసరంగా ఉండగా వారి దాతృత్వ గుణం పసిగట్టిన బిక్షగాళ్లు ఆ సీజన్ లో ఇబ్బడిముబ్బడిగా పలు ప్రాంతాలలో కనిపించారు బిచ్చగాళ్ళు సాధారణంగా గుంపులుగా ప్రజలు ఉండే స్థలాలను లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ నేపథ్యంలో మసీదులకు, బహిరంగ మార్కెట్లకు, వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలకు వెళతారని ఆయన తెలిపారు. యాచన అనే సమస్యని అధిగమించడానికి అందరు సహకరించమని అధికారికంగా పిలుపునిచ్చారు. ఎవరైనా బహిరంగంగా లేదా ప్రైవేటు ప్రదేశాల్లో యాచించడం జరిగితే వారిని ఒక నెల కంటే తక్కువకాకుండ మరియు ఒక సంవత్సరం మించకుండా జైలుశిక్ష విధిస్తారు, మరియు ఓమిని చట్ట ప్రకారం, 50 కంటే తక్కువ కాకుండా రియాల్స్ (477 ధిర్హాంలు) కంటే తక్కువ మరియు 100 కంటే ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. యాచన చేస్తున్న బిచ్చగాడు ఒమానీ దేశీయుడు కాకపోతే అతడు / ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. ఒక ఒమాని బిచ్చగాడు తిరిగి తన యాచన నేరాలను పునరావృతం చేస్తే, అతడు / ఆమెకు ఆరు నెలల కాలానికి తక్కువ కాకుండా ,రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కానుందా జైలు శిక్ష విధించబడతారు.అంతేకాకుండా, పిల్లలను లేదా ఇతరులను అడుక్కొనేందుకు ఉపయోగించుకునేవారు ఎవరైనా మూడు నెలల కాలం కంటే తక్కువ కాకుండా మూడు సంవత్సరాల కాలం ఎక్కువ కాకుండా జైలు శిక్షను పొందుతారు. అలాగే 50 రియాల్స్ తక్కువ కాకుండా 100 కంటే ఎక్కువ రియాల్స్ కాకుండా జరిమానాతో పాటు కొరడా దెబ్బలు అదనంగా ఉంటాయి. 2015 లో అరెస్టు కాబడిన 612 యాచకులతో సరిపోలిస్తే, 2016 లో 835 బిచ్చగాళ్ళు అధికమైనట్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







