జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ లో చేరండి అంటూ సూపర్ ఆఫర్

- February 14, 2018 , by Maagulf
జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ లో చేరండి అంటూ సూపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయానికి గురౌతుందని ఆరోపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జేఏసీ కి శ్రీకారం చుట్టారు. పవన్ ఏర్పాటు చేసిన జేఏసీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయమై ప్రస్తుతం పోరాటం చేస్తుందని ప్రకటించారు.

ఈ క్రమంలో పవన్ స్థాపించిన జేఏసీ లో పని చేసేందుకు సిద్ధమైన లోకసత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల లెక్కలు తేల్చే పనిలో పడ్డారు.

 


ఈ క్రమంలో వీరిద్దరు కలిపి ఇచ్చే లెక్కల ద్వారా ఎవరు అబధం ఆడుతున్నారో తేలిపోతుంది. అయితే ఈ క్రమంలో జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ తన పార్టీకి రాజకీయంగా సలహాలు ఇచ్చేందుకు, తనకు మార్గదర్శకంగా ఉండేందుకు జనసేనలో చేరాలని వారిని కోరినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం మాటికి ఈ ఇద్దరు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఇదిలావుండగా భవిష్యత్తులో ఈ ఇద్దరు వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ పార్టీలోకి వస్తే మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ ని జనసేన పార్టీ తరఫున పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com