కువైట్‌లో వర్కర్స్‌పై బ్యాన్‌ విధించిన ఫిలిప్పీన్స్‌

- February 14, 2018 , by Maagulf
కువైట్‌లో వర్కర్స్‌పై బ్యాన్‌ విధించిన ఫిలిప్పీన్స్‌

కువైట్‌లో తమ పౌరుల పట్ల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ నివేదికలు తేటతెల్లం చేస్తున్న దరిమిలా, ఫిలిప్పీన్స్‌, కువైట్‌లో పనిచేసేందుకు వెళ్ళే కార్మికులపై బ్యాన్‌ని కొనసాగించింది. ఫిలిప్పీన్స్‌ లేబర్‌ సెక్రెటరీ సిల్వెస్టర్‌ బెల్లో మాట్లాడుతూ, కువైట్‌లో కొత్త ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి తమ దేశంలో టోటల్‌ బ్యాన్‌ విధించినట్లు తెలిపారు. అయితే కువైట్‌లో ఇప్పటికే పనిచేస్తోన్న ఫిలిప్పినోస్‌కి సంబంధించిన పర్మిట్లను రీకాల్‌ చేసే అంశమై ఎలాంటి స్పందనా అధికారుల నుంచి రాలేదు. ఫిలిప్పీన్స్‌ పారిన్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ మాట్లాడుతూ, కువైట్‌లో ఓవర్‌స్టేయింగ్‌ చేస్తోనన్న 10,000 మందికి పైగా ఫిలిప్పినోస్‌ని రప్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com