అకస్మాత్తుగా విమానం కుడి ఇంజిన్‌ను కప్పి ఉంచే కవచం ఊడి ఎగిరిపోయింది
- February 14, 2018
విమానం ఇంజిన్ కవచం ఎగిరిపోయింది..
హోనోలులు : విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు ఓ ప్రమాదకర దృశ్యాన్ని చూసి ప్రయాణికులు హడలెత్తిపోయారు. విమానం ఇంజిన్లలో ఒకదాన్ని కప్పిఉంచే కవచం గాలికి ఎగిరిపోయింది. వెంటనే పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శాన్ఫ్రాన్సిస్కో నుంచి హోనోలులుకు వెళ్తోంది. విమానం పసిఫిక్ మహాసముద్రంపై వెళ్తున్నప్పుడు.. అకస్మాత్తుగా విమానం కుడి ఇంజిన్‌ను కప్పి ఉంచే కవచం ఊడి ఎగిరిపోయింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంజిన్ భాగాన్ని విమానంలోని ప్రయాణికులు చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి దాదాపు 370 మంది ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు ఎమర్జెన్సీ ప్రకటించి విషయాన్ని ఏటీసీకి తెలియజేశారు. అనంతరం సురక్షితంగా విమానాన్ని హోనోలులు ఎయిర్‌పోర్ట్‌లో దించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఈ ఘటన అనంతరం పలువురు ప్రయాణికులు తమకెదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 'నా జీవితంలో అత్యంత భయానకమైన విమాన ప్రయాణం ఇది' అని మార్కెంటింగ్ కన్సల్టెంట్ అయిన మారియా పేర్కొంటూ ఇంజిన్‌కు చెందిన ఓ ఫొటోను ట్విటర్లో పెట్టింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి